టాలీవుడ్ హీరో రానా.. ‘పెళ్ళంటే చాలా భయం అని, సంసారం బాధ్యతలు నాకు తెలీదు.. నేను వాటిని మోయలేను’ అంటూ గతంలో కామెంట్లు చేసేవాడు. దాంతో ప్రభాస్ తరువాత టాలీవుడ్లో ఎక్కువ కాలం బ్యాచిలర్ గా ఉండిపోయేది రానానే’ అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ కట్ చేస్తే.. ‘ఆమె ఎస్ చెప్పింది’ అంటూ గతేడాది ఓ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు రానా. ఆ పోస్ట్ ఎంత పెద్ద వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మిహీక బజాజ్ అనే ఈవెంట్ మేనేజర్ ను అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే గత ఏడాది అంటే ఆగష్టు 8న ఆమెను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. రానా ఈ పోస్ట్ చేసి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్ ను అతని భార్య మిహీకా రీ పోస్ట్ చేస్తూ..’రానా తన మనసులోని మాట చెప్పాడు. నేను కూడా వెంటనే ఓకే చెప్పాను.
నా జీవితంలో నేను తీసుకున్న డేరింగ్ స్టెప్ అదే. ఇది జరిగి అప్పుడే సంవత్సరం గడిచిందంటే నేను నమ్మలేకపోతున్నాను. రానా.. ఆరోజు నువ్వు నన్ను అలా అడిగినందుకు థాంక్స్.’ఐ లవ్ యూ రానా’ ‘ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. ఇక రానా భార్య మిహీకా.. వెంకటేష్ కూతురు అశ్రితకి బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీళ్ళిద్దరూ క్లాస్ మేట్స్ కూడా..!