క్రియేటివ్ డైరక్టెర్ కృష్ణవంశీ హిట్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. తాను డైరక్ట్ చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ అలసిపోవడం లేదు. నిరాశలో మరింత కసిగా కథలను సిద్ధం చేస్తున్నారు. ఎలాగైనా పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. గతఏడాది సందీప్, సాయి ధరమ్ తేజ్ లతో “నక్షత్రం” తీసి ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆయన మరో మల్టీ స్టారర్ కథని రెడీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కథని మాధవన్ కి వినిపించారంట. ఆయన రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఇందులో మరో రెండు కీలక రోల్స్ ఉన్నాయి.
వాటిలో ఒక పాత్రలో నటించడానికి రానా దగ్గుబాటి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రానాకీ ఈ కథ, రోల్ బాగా నచ్చాయని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మరో హీరో ఎవరు అనేది ఇంకా బయటికి రాలేదు. తేజ రానాతో నేనే రాజు నేనే మంత్రి తీసి హిట్ ట్రాక్ లోకి వచ్చారు. అలాగే కృష్ణ వంశీ కూడా ఈ మల్టీ స్టారర్ సినిమాతో ఫామ్లోకి రావడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.