Rana Naidu: ఆ వెబ్‌సిరీస్‌ సంగతి మర్చిపోయారా..?

ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత కూడా రిలీజ్ విషయంలో ఆలస్యం జరగడం చూశాం. గ్రాఫిక్స్ వర్క్ కోసం, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా పలు కారణాల వలన సినిమా రిలీజ్ లేట్ అవుతుంటుంది. పర్ఫెక్షన్ కోసం దర్శకులు ఎక్కువ సమయం తీసుకుంటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు ఇలానే చేస్తుంటారు. వారి సినిమాల రిజల్ట్స్ కూడా బాగా వస్తుంటాయి. కానీ ఒక మాఫియా డ్రామా వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్ధం కావడం లేదు.

దగ్గుబాటి రానా, వెంకటేష్ లు తొలిసారి ఇద్దరూ కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. గతేడాది దసరా లేదా దీపావళికి సిరీస్ రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పటివరకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. బాబాయ్, అబ్బాయ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ను చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘ఎఫ్3’ సినిమా తరువాత వెంకటేష్ ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఆయన కెరీర్ లో కొంత బ్రేక్ తీసుకునేలా ఉన్నారు. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలనుతో చేయబోయే యాక్షన్ ఎంటర్టైనర్ ని ఇప్పట్లో మొదలెట్టేలా లేరు. అలా చూసుకుంటే ‘రానా నాయుడు’తోనే ఇప్పుడు ఫ్యాన్స్ ను అలరించాల్సి ఉంటుంది. పైగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.

వెంకీ పూర్తిగా తెల్లజుట్టుతో చాలా డిఫరెంట్ గా కనిపించారు. రానా క్యారెక్టర్ డిజైనింగ్ కూడా బాగుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ వెబ్ సిరీస్ ను త్వరగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ఇంతగా పెండింగ్ పెట్టదు. కానీ ‘రానా నాయుడు’ విషయంలో మాత్రం ఎందుకో జాప్యం జరుగుతుంది. అమెరికా టీవీ క్రైమ్ సిరీస్ రే డొనోవన్ రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ కి సుపర్న్ వర్మ – కరణ్ అంశుమాన్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus