బాలీవుడ్ లో పెరిగిన రానా రేంజ్ !
- June 27, 2017 / 12:34 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో పవర్ స్టార్ మ్యానియా గురించి మన ప్రత్యేకంగా చెప్పుకోవాలిన పనిలేదు. అయితే అదే క్రమంలో పవన్ వస్తున్నాడు అంటే చాలు… ఆ ప్రాంతం అంతా సంద్రంలాగా మారిపోతుంది. ఇక అదే క్రమంలో పవన్ సినిమా అంటే ఆ ఊపే వేరు…ఇదిలా ఉంటే టాలీవుడ్ లో పవన్ తో పోటీ పడుతున్నాడు దగ్గుపాటి రానా….అదేంటి పవన్ క్రేజ్ ఎక్కడా? రానా క్రేజ్ ఎక్కడా? రానా పవన్ తో పోటీ పడటం ఏంటి హాస్యానికి కూడా హద్దు ఉండాలి అనేగా మీ సందేహం…అయితే ఒకసారి ఈ కధ చదవండి మీకే ఒక క్ల్యారిటీ వస్తుంది. అసలు మ్యాటర్ ఏంటి అంటే…పవన్ సినిమా రేంజ్ కు తన సినిమా మార్కెట్ చేస్తూ సత్తా చాటుతున్నాడు రానా ఇప్పుడు ఇండస్ట్రీ లో అదే హాట్ టాపిక్…. అదెలా అంటే పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా హింది వర్షన్ 11 కోట్లకు అమ్ముడయ్యిందని వార్తలు వస్తున్నాయి.
శాటిలైట్ రైట్స్ తో కలుపుకుని పవన్ సినిమాను 11 కోట్లకు అమ్మేశారు దర్శక నిర్మాతలు. ఇక ప్రస్తుతం రాణా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా హింది వర్షన్ భారీ మొత్తం పలికిదని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాణా సినిమా కూడా 11 కోట్ల దాకా రేటు పలికిందట. బాహుబలితో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన రాణా ప్రస్తుతం అక్కడ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. మొత్తంగా చూసుకుంటే నేనే రాజు నేనే మంత్రిలో చేస్తున్న టిపికల్ క్యారక్టర్ రానాకి మంచి పేరు తెచ్చిపెడుతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు…మరి ఈ సినిమా రిసల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












