బిచ్చగాడు రీమేక్ ఒప్పుకోని రానా

  • June 11, 2016 / 11:51 AM IST

తమిళ సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ ఆంటోనీ తమిళంలో నిర్మించి, నటించిన సినిమా ‘పిచ్చైకారన్’. ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో చదలవాడ పద్మావతి విడుదల చేసారు. పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా మౌత్ టాక్ తోనే మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కేవలం రూ. 50 లక్షలకే తీసుకున్నారు. మే 13 న రిజిల్ అయిన “బిచ్చగాడు” రూ.8 కోట్లకు పైగానే వసూలు సాధించాడు.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో విషయం బయటపడింది. తమిళంలో హిట్ అయిన వెంటనే  ఈ సినిమాను ముందు తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలని భావించారు. అయితే సినిమా చూసిన రానా, తన ఇమేజ్ కు, ఫిజిక్ కు ఈ పాత్ర సరిపోదని భావించి నో చెప్పేశాడు. దీంతో తమిళ నిర్మాతలు అదే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమానే తెలుగు స్ట్రయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను రాబట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus