కోలీవుడ్ యువ గాయని సుచిత్ర కార్తిక్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో హంగామా సృష్టించింది. తమిళ హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనిరుద్ గురించి సీక్రెట్ ఫోటోలను రిలీజ్ చేసి వార్తల్లో నిలిచింది. అదే సమయంలో కొంతమంది స్టార్స్ విషయాలను బయటపట్టింది. అందులో రానా, త్రిషలు కూడా ఇరుక్కున్నారు. వారిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటో నెట్లో హల్ చల్ చేసింది. త్రిష రానా బుగ్గపై పెడుతున్న ఫోటో చూసి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై రానా తాజాగా స్పందించారు.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాట్లాడుతూ ” సుచిత్ర అనేక మంది చిత్రాలను బయటపెట్టింది. అందులో నా ఫోటో ఒక్కటే పాపులర్ అయింది. ఇతర స్టార్స్ కంటే నాకు పాపులారిటీ ఎక్కువవుంది కాబట్టి నా గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. అంతేకాదు మీడియాకూడా ఈ విషయాన్నీ పెద్దది చేసి చూపించింది. నాకు, త్రిష మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు”అని రానా స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.