విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రణబాలి'(Ranabaali). వివాహం తర్వాత విజయ్- రష్మిక కలిసి నటించిన సినిమా ఇది. అందులోనూ పీరియాడిక్ మూవీ. ‘ఇరుముడి’ వంటి జెనరేషనల్ బ్లాక్ బస్టర్ అందించిన ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన సినిమా. ఈరోజు అనగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
సినిమాలో ప్లస్ పాయింట్స్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి :
విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్
ఇలాంటి పీరియాడిక్ సినిమాకి హీరో ఎంట్రీ సీన్ బాగుండాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకు తగ్గట్టే విజయ్ ఎంట్రీ సీన్..ను సాలిడ్ గా డిజైన్ చేశారు. మొరటోడి పాత్రలో విజయ్ దేవరకొండ బాగా చేశాడు. ముఖ్యంగా రష్మిక పాత్ర ఎంట్రీ ఇచ్చాక.. విజయ్ ఎక్కడా తగ్గకుండా నటించాడు. ఫస్ట్ నైట్ సీన్ ‘అర్జున్ రెడ్డి’ ఫీల్ ఇస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ లో సాయి సుధా- విజయ్..ల మధ్య వచ్చే సీన్ లానే.. ‘రణబాలి’ లో ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది. అయినప్పటికీ దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు.
రష్మిక లుక్స్ అండ్ పెర్ఫార్మన్స్
అమాయకంగా కనిపించే గడసరి అమ్మాయి జయమ్మ పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. ‘ఏందయ్యా సామి’ సాంగ్లో ఎంత నేచురల్ గా చేసిందో అంతే బ్యూటిఫుల్ గా కనిపించింది. అయితే జయమ్మలోకి అప్పుడప్పుడు శ్రీవల్లి(పుష్పలో రష్మిక చేసిన పాత్ర) వచ్చి వెళుతూ ఉంటుంది. బహుశా రాయలసీమ స్లాంగ్ కారణంగా అయ్యుండొచ్చు.
ప్రీ ఇంటర్వెల్ బ్లాక్
సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కానీ జయమ్మ ఎపిసోడ్ వచ్చినప్పటి నుండీ పికప్ అవుతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ వద్ద వచ్చే చిన్నపిల్లల ఎపిసోడ్ నుండీ పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది.
గుహ ఫైట్
సెకండాఫ్ లో వచ్చే గుహ ఫైట్ సీక్వెన్స్ గూంజ్ బంప్స్ తెప్పిస్తుంది. ఒక డివైన్ ఫీలింగ్ ఇస్తుంది.
అలాగే విలన్ కి రష్మిక మందన వార్నింగ్ ఇచ్చే సన్నివేశం, దానికి ముందు వచ్చే సాంగ్ బాగున్నాయి.
క్లైమాక్స్
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, అక్కడ మళ్ళీ డివైన్ యాంగిల్ పెట్టడం కొసమెరుపు.
మ్యూజిక్
అజయ్- అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎక్కడా ఓవర్ ది టాప్ వెళ్ళకుండా.. సినిమా మూడ్ కి తగ్గట్టు బ్యాలెన్స్డ్ గా కంపోజ్ చేశారు. అందువల్ల సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి.
రాహుల్ సాంకృత్యాన్ రైటింగ్లో కొన్ని సంభాషణలు బాగున్నాయి. టేకింగ్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ ల్యాగ్ ఫీల్ ఇస్తుంది.
కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి. పీరియాడిక్ సినిమా, అందులోనూ పేట్రియాటిక్ సినిమా అన్నాక వయొలెన్స్ ఉంటుంది. కానీ ఇందులో ఇంకాస్త ఎక్కువగా ఉంది
తల్లిపాత్రలో ఈశ్వరి రావు బాగా చేసినప్పటికీ..! ఫస్ట్ సీన్లో ఆమె బాహుబలిలో రమ్యకృష్ణలా ఎందుకు కొండపైకి వెళ్ళింది. ఆమె గతం ఏంటి? అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు.
క్లైమాక్స్ లో ముఖ్యంగా లాస్ట్ ఫైట్లో వీ ఎఫ్ ఎక్స్ వీక్ గా ఉంది.