Ranga Ranga Vaibhavanga Collections: డిజాస్టర్ మిగిలిన ‘రంగ రంగ వైభవంగా’..!

  • October 1, 2022 / 03:39 PM IST

‘ఉప్పెన’ కొండపొలం’ వంటి చిత్రాల అనంతరం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చేసి హిట్టు కొట్టిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది.

దీంతో ఏమాత్రం డీసెంట్ కలెక్షన్స్ ను నమోదు చేయలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 1.18 cr
సీడెడ్ 0.36 cr
ఉత్తరాంధ్ర 0.44 cr
ఈస్ట్ 0.35 cr
వెస్ట్ 0.22 cr
గుంటూరు 0.33 cr
కృష్ణా 0.30 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.24 cr
ఓవర్సీస్ 0.54 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.15 cr

‘రంగ రంగ వైభవంగా’ చిత్రానికి రూ.8.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది చాలా ఈజీ టార్గెట్. కానీ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.4.15 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ బయ్యర్స్ కు రూ.4.35 కోట్ల నష్టాలను మిగిల్చింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus