Rangasthalam: ‘రంగస్థలం’ నటుడు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • August 8, 2023 / 11:11 AM IST

సినిమాల్లో గుండు లుక్ లో కనిపించి విలన్ పాత్రలు లేదా విలన్ కి అసిస్టెంట్ పాత్రలు చేస్తున్న అజయ్ ఘోష్ గురించి ప్రత్యేక పరిచయం అవకాశం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చే చాలా సినిమాల్లో అతను నటిస్తున్నాడు. ఇప్పుడైతే బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అతను గతంలో చాలా ఇబ్బందులు పడ్డాడట. అవకాశాలు లేక కూలి పనులకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయట. స్వయంగా అజయ్ ఘోష్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ” సినిమాల్లో ఛాన్సుల కోసం తిరిగి .. తిరిగి అలసిపోయాను.నా మొదటి సినిమా ‘ప్రస్థానం’. అందులో దర్శకులు దేవ కట్టా గారు మంచి పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతి లక్ష్మి’ అనే సినిమాలో కూడా నటించాను. ఆ సినిమాకి కూడా మంచి అప్లాజ్ దక్కింది. అయినప్పటికీ ఆ తర్వాత ఛాన్సులు కరువయ్యాయి. ఏడాదిన్నర పాటు అవకాశాలు లేక నేను ఖాళీగా ఉన్నాను. అలాగే ఉంటే కష్టం అని భావించి.. మళ్లీ కూలి పనులకు వెళ్లడం కూడా జరిగింది.

అలాంటి టైంలో సుకుమార్ గారు ‘రంగస్థలం’ తో ఓ మెట్టు పైకి ఎక్కించారు. తర్వాత ‘పుష్ప’ లో కూడా నాకు రోల్ ఇచ్చారు. ఆ సినిమా టైంలో సుకుమార్ గారు చేసిన సాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను. నటుడిగా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. అయితే తెలుగులో పూరి జగన్నాథ్.. సుకుమార్, తమిళంలో వెట్రి మారన్ వంటి దర్శకుల సినిమాల్లో నటించాను. అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. ‘బెదురులంక’ అనే సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అందులో కూడా నాది చాలా మంచి పాత్ర” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus