రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

  • August 5, 2017 / 11:09 AM IST

పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైనప్పట్నుంచి రామ్ చరణ్-సుకుమార్ ల సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సినిమాలో రామ్ చరణ్ లుక్, సమంత స్టిల్స్ చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాక సినిమా అభిమానులూ ఫిదా అయిపోయారు. దాంతో మామూలుగా కంటే సినిమాపై ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకి. ఆ ఇంట్రెస్ట్ ను టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో ఇంకాస్త పెంచేశాడు దర్శకుడు సుకుమార్. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను పెట్టుకొని సినిమాకి సింపుల్ గా “రంగస్థలం” అనే టైటిల్ ను ఫిక్స్ చేసేశాడు. టైటిల్ పట్ల మొదట్లో కాస్త నెగిటివ్ కామెంట్స్ వినపడినా.. సుకుమార్ వివరంగా కాన్సెప్ట్ గురించి చెప్పేసరికి అందరూ కన్వీన్స్ అయిపోయారు.

ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో విశేషం ఏంటంటే.. సదరు ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన “ఖైదీ” గెటప్ లో ఉంటాడని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. చరణ్ నిజంగా అలా ఖైదీ లుక్ లో కనిపిస్తే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండలు!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus