రంగ‌స్థ‌లం మూవీ ఫ‌స్ట్ లుక్ టీజర్ | రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌

  • January 24, 2018 / 11:02 AM IST

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న భారీ చిత్రం `రంగ‌స్థ‌లం`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మించారు. “శ్రీమంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్‌` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో  రూపొందుతోన్న మోస్ట్ ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్ `రంగ‌స్థ‌లం`. చిట్టిబాబు అనే పాత్ర‌లో రామ్‌చ‌రణ్ మాస్ యాక్టింగ్‌, స‌మంత గ్లామర్ ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. విల‌క్ష‌ణ‌మైన క‌థ‌లు, క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను తెరపై సిద్ధ‌హ‌స్తుడైన ద‌ర్శ‌కుడు సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాలే ఆయ‌నేంటో చెబుతాయి. మ‌రోసారి త‌న‌దైన స్ట‌యిల్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను సుకుమార్‌గారు ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ఇంతకు ముందెన్న‌డూ చేయ‌ని విభిన్న‌మైన‌ పాత్ర‌లు చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌పీ  సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి 30న వ‌రల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus