నగ్నంగా రణ్ వీర్ సింగ్.. ?

  • May 16, 2016 / 01:39 PM IST

తనదైన నటనతో ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రణ్ వీర్ సింగ్ తన తదుపరి చిత్రంలో నగ్నంగా కనిపించనున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బేఫికర్’ చిత్రంలో వాణి కపూర్, రణ్ వీర్ జంటగా నటిస్తుండగా..

ఈ చిత్రంలో బాజీరావ్ నగ్నంగా కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ చిత్రంలో 23 లిప్ లాక్ లు ఉన్నాయంటూ సంచలనం సృష్టించారు. యష్ రాజ్ ఫిల్మ్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా బాలీవుడ్ నటులు నగ్నంగా కనిపించడం కొత్తేమీ కాదు ‘దోస్తానా’ చిత్రంలో జాన్ అబ్రహం, ‘సావరియా’ చిత్రంలో రణ్ బీర్ కపూర్ లు నగ్నంగా నటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus