వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’ (Rao Bahadur) . ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి కల్ట్ మూవీ తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ చేసిన 2వ సినిమా ఇది. చాయ్ బిస్కట్ అనురాగ్, శరత్ చంద్ర..లతో కలిసి ‘క’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన సినిమా ఇది. మహేష్ బాబు, నమ్రత ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించడం అనేది ‘ రావు బహదూర్ ‘ కి మేజర్ ప్లస్ పాయింట్.
అయితే జూలై 3న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టిందని.. సెకండాఫ్ కొంత పర్వాలేదనే విధంగా ఉన్నప్పటికీ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా కాదని .. సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా నమోదయ్యాయి.
కానీ మొదటి సోమవారం బాగా డౌన్ అయ్యింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 1.33 cr |
| సీడెడ్ | 0.14 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.81 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 2.28 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + తమిళనాడు | 0.43 cr |
| ఓవర్సీస్ | 1.75 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 4.46 cr (షేర్) |
‘రావు బహదూర్’ (Rao Bahadur) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4వ రోజు వీక్ డే కావడంతో బాగా డౌన్ అయ్యింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.4.46 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.54 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో స్ట్రాంగ్ గా నిలబడితేనే బ్రేక్ ఈవెన్ అవకాశం ఉంటుంది.