మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రావు రమేష్?
- May 12, 2019 / 02:18 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో ప్రకాశ్ రాజ్ తరువాత ఆ తరహా పాత్రలను ఆ స్థాయిలో పండించగల నటుడు రావు రమేశ్ అనడంలో సందేహం లేదు. తన తండ్రి రావుగోపాల్ రావు లానే డైలాగులు చెబుతూ… సహజమైన నటనతో ఆకట్టుకోవడం రావు రమేశ్ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. అలాంటి రావు రమేశ్ మరో విభిన్నమైన పాత్ర చేయబోతున్నాడట. మెగా హీరో చిత్రంలో రావు రమేష్ ఈ పాత్ర చేయబోతున్నాడట.
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఆ మెగా హీరో మరెవరో కాదు మన సాయితేజే…! ప్రస్తుతం తేజు, మారుతి డైరెక్షన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అయ్యాడు. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో తేజు తండ్రి పాత్ర చాలా కీలకమట. అందువలన ఈ పాత్ర కోసం రావు రమేశ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారని తెలుస్తుంది.











