సామాన్యులకే కాదు, సెలెబ్రెటీస్ కి సైతం రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా సెలెబ్రెటీస్ ఇంట్లో పని చేసే వాళ్లే వాళ్లపై దాడులు చేస్తూ, అత్యాచారయత్నలకు పాల్పడుతున్నారు. తాజాగా మన సినీ నాటి భావన ఉదంతం చూశాం ,పక్కా స్కెచ్ తో భావనను అత్యాచారం చెయ్యాలి అని ప్రత్యత్నించి విఫలం అయ్యింది ఒక గ్యాంగ్. ఈ విషయం మరచిపోకముందే, అదే విధంగా, పక్కా ప్లాన్ తో మరో అఘాయిత్యం జరిగింది, అయితే ఈసారి ప్లేస్ వేరు, పర్సన్ వేరు. అసలు ఏం జరిగింది అని కాస్త వివరాల్లోకి వెళ్ళి నిశితంగా పరిశీలిస్తే, పెను సంచలనంగా మారిన ఈ సంఘటన బెంగుళూర్ లో జరిగింది. బెంగుళూర్ సమీపంలోని ఓ టివి సీరియల్ షూటింగ్ లో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఓ అద్దె కారులో రూపా పై అత్యాచారయత్నం చేసారు కారు డ్రైవర్ తో పాటు అతడి మరో స్నేహితుడు.
అచ్చం మళియాళ నటి భావనకు జరిగిన తీరులోనే..కారులో రూపా పై అత్యాచారానికి ప్రయత్నించారు అయితే రూపా గట్టిగానే వాళ్లతో ప్రతిఘటించడం తో పాటు అదే దారిలో కొన్ని వాహనాలు కూడా వస్తుండటంతో భయపడిన వాళ్ళు రూపాని కారు లోంచి నెట్టి వేసి పారిపోయారు. అక్కడ ఉన్న కొంత మంది సహకారం తో పోలీసులను ఆశ్రయించిన రూపా ఫిర్యాదు చేసింది. మొత్తంగా చూసుకుంటే సెలెబ్రెటీస్ సైతం సెక్యూరిటీ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అన్న సంగతి ఇట్టే అర్ధం అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.