యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” శుక్రవారం రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ మూవీ తొలి రోజే 3.56 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్య పరిచింది. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ అందమైన మూవీ వీకెండ్స్ లో మంచి కలక్షన్స్ వసూలు చేసింది. శనివారం 3.25 కోట్లు, ఆదివారం 3.92 కోట్లు షేర్ సాధించింది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రెండు కోట్లు సాధించి నాగచైతన్య క్రేజ్ ని నిరూపించింది. కేవలం ఓవర్సీస్ లోనే ఇప్పటివరకు 2.39 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి నాలుగు రోజుల్లో “రారండోయ్ వేడుక చూద్దాం” ప్రపంచ వ్యాప్తంగా 12 .73 కోట్ల షేర్ రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లోనే 10 .34 కోట్ల షేర్ రాబట్టింది.
ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు..
నైజాం 3.70 కోట్లు
సీడెడ్ 1.45 కోట్లు
ఉత్తరాంధ్ర 1.50 కోట్లు
ఈస్ట్ 0.89 కోట్లు
వెస్ట్ 0.67 కోట్లు
కృష్ణ 0.88 కోట్లు
గుంటూరు 0.94 కోట్లు
నెల్లూరు 0.30 కోట్లు
రెండు రాష్ట్రాల్లో మొత్తం 10 .39 కోట్లు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.