“రారండోయ్ వేడుక చూద్దాం” 2 వీక్స్ కలక్షన్స్

  • June 10, 2017 / 04:13 PM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” గత నెల 26 రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ మూవీ తొలి రోజే 3.56 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్య పరిచింది. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ అందమైన మూవీ మంచి కలక్షన్స్ వసూలు చేస్తోంది. భ్రమరాంబగా రకుల్ ప్రీత్ సింగ్ అదరగొట్టిన “రారండోయ్ వేడుక చూద్దాం” తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల్లో18.94 కోట్ల షేర్ రాబట్టింది.

ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు..
నైజాం 7.05 కోట్లు
సీడెడ్ 2.52 కోట్లు
వైజాగ్ 2.98 కోట్లు
ఈస్ట్ 1.68 కోట్లు
వెస్ట్ 1.15 కోట్లు
కృష్ణ 1.45 కోట్లు
గుంటూరు 1.55 కోట్లు
నెల్లూరు 0.56 కోట్లు
రెండు రాష్ట్రాల్లో మొత్తం 18.94 కోట్లు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus