‘బిగ్ బాస్ 6’ లో 8వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది గీతు రాయల్. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూనే తనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి, తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే దాని గురించి ఎవి ద్వారా షేర్ చేసుకుంది. తన భర్తని కూడా పరిచయం చేసింది. బిగ్ బాస్ షోని రివ్యూస్ చేస్తూ యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకున్న గీతు రాయల్ మొదట మోటివేషనల్ వీడియోలు చేసేది. ఇక హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు …
బాత్ రూంలో జుట్టు గురించి మరో కంటెస్టెంట్ ఇనయ సుల్తానా తో మాటల యుద్ధానికి దిగిన ఈమె పై కొంత నెగిటివిటీ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. చాలా మంది ఈమె మొదటి వారమే వెళ్ళిపోతుంది అని, మరికొంత మంది రెండు నుండి నాలుగు వారాల్లో సర్దేస్తుందని ఈమె తెలిపింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు క్రేజ్ ఎక్కువే ఉందని చెప్పాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :