Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో అద్భుతమైన రికార్డ్.. ఏం జరిగిందంటే?

  • June 29, 2024 / 01:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న రికార్డులు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో అద్భుతమైన రేర్ రికార్డ్ చేరగా ఆ రికార్డ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ నటించిన బాహుబలి2 (Baahubali 2) , సాహో(Saaho) , ఆదిపురుష్  (Adipurush), సలార్ (Salaar), కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD)  సినిమాలు తొలిరోజునే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

ఈ రికార్డును సొంతం చేసుకున్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డును ప్రభాస్ సొంతం చేసుకోవడం గమనార్హం. బాహుబలి ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు 217 కోట్ల రూపాయలు కాగా సాహో ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు 130 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఆదిపురుష్ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు 140 కోట్ల రూపాయలు కాగా సలార్ ఫస్ట్ డే కలెక్షన్లు 178 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

కల్కి 2898 ఏడీ ఏకంగా 191.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలు మాత్రమే ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం కలెక్షన్ల పరంగా అదరగొట్టడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.

ప్రభాస్ ఈ ఏడాది కన్నప్ప (Kannappa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కన్నప్ప సినిమాలో సైతం ప్రభాస్ ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారు. కన్నప్ప సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయి. ప్రభాస్ రెస్ట్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus