హవ్వ!!అన్నీ ముందే అయిపోయాయా??

సినీ ప్రస్థానంలో దూసుకుపోదాం అని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తన అదృష్టాన్ని పరీక్షించుకున్న హాట్ గర్ల్ రేష్మి…అరా..కొరా సినిమాలు చేసింది కానీ, పెద్దగా కలసి రాకపోవడంతో, బులితేరపై కన్ను వేసింది. ఇక దొరక్క దొరక్క లైవ్ క్యారక్టర్ దొరికితే దుమ్ము దులిపేయాలి అని అనుకున్న రేష్మి ‘జబర్దస్థ్’ పుణ్యమా అని, కనిపించి…కనిపించనట్లుగా….చూపించి…చూపించనట్లుగా కుర్రకారుని ఉర్రూతలూగించింది.

ఇదిలా ఉంటే, మరోసారి టాలీవుడ్ లో ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో అవకాశం దక్కిన రేష్మి, రెచ్చిపోయి నటించింది. తొలి సినిమాతోనే మోస్ట్ పాప్యులర్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. అయితే సినిమా కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ..రేష్మి అందాల ఆరబోతకు కుర్ర కారు కిక్కెక్కి చస్తున్నారు…మళ్లీ..మళ్ళీ సినిమాకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే, గుంటూర్ టాకీస్  ముద్దు దృశ్యాల నుంచి కౌగిలింతలు, శృంగార సన్నివేశాల్లో జీవించేసిన ఈ భామ, అంతలా  రెచ్చిపోయి ఎలా నటించగలిగారు అన్న మీడియా ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చింది. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే…షూటింగ్ మొదలు కాక ముందే…హీరో సిద్దూ కలిసి కొన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిందట.

బాగా క్లోజ్ గా మూవ్ అయ్యారట. ఇద్దరి మధ్యా కెమిస్ట్ర్రీ కుదురుతుందని నమ్మకం వచ్చాకే షూటింగ్ లోకి దిగారట. ఇదంతా సాక్షాత్తూ రేష్మి మీడియాకు వివరించింది. ఎందుకలా చేశారు అంటే…తెలియని వ్యక్తులతో రొమాంటిక్‌ సాంగ్‌ అంటే అస్సలు చేయలేమని భావించి, ముందుగానే రిహార్శెల్స్ లాగా ఇలా చేసినట్లు ఈ భామ చెబుతుంది. ఓరి నాయనో…రొమ్యాన్స్ వరకూ బాగానే ఉంది కానీ, ఇదేదో, హంతకురాలి పాత్ర, బందిపోటు పాత్ర అయితే….రిహార్శెల్స్ అన్న పేరుతో ఎంతమందిని ఛంపేదో అంటూ టాలీవుడ్ ముక్కున వేలేసుకుంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus