సెక్సుకు సంబందించిన విషయాలకు ఆదరణ ఎక్కువ : రష్మీ

  • December 26, 2018 / 11:20 AM IST

‘జబర్దస్త్’ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. ఈ షోలో పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ కుర్ర కారుని హీటెక్కిస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఒక పక్క యాంకర్ గా రాణిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ తన ప్రతీ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా ట్విట్టర్ లో అభిమానులడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ ట్విట్టర్లో అభిమానులతో చాట్ సెషన్లో పాల్గొంది. అయితే ఇందులో రష్మికి ఊహించని ప్రశ్నలు ఎదురవ్వగా వాటికి బోల్డ్ గా ఆన్సర్స్ ఇచ్చింది.

2018 కూడా అయిపోతోంది… మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగిన ప్రశ్నకు రష్మి సమాధానమిస్తూ …. నాకు పెళ్ళి కంటే ముందు బేబీ కావాలి, త్వరలోనే అది జరుగుతుంది అని భావిస్తున్నాను అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఎవరైనా మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి రాత్రికి రమ్మంటే మీరు ఏం చేస్తారు? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ ‘అది అడిగే వ్యక్తిపై ఆధార పడి ఉంటుంది’ అంటూ బోల్డ్ గా చెప్పింది. పెళ్ళికి ముందే మీరు బేబీని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా ఏమిటి? అనగా…. రష్మి అవును అని సమాధానం ఇచ్చింది. ఇక తన ఫేవరెట్ డిష్ పచ్చి పులసు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. రాజమౌళి, శంకర్… ఈ ఇద్దరిలో ఉత్తమ చిత్రాలు, ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాలు తీసేది ఎవరు? అనే ప్రశ్నకి ‘శంకర్ సర్’ అని రిప్లై ఇచ్చింది.బాలీవుడ్ పై తన ఇంట్రస్ట్ గురించి ఆడితే… అవకాశం వస్తే బాలీవుడ్లోకి కచ్చితంగా వెళతాను అని చెప్పింది. రాత్రికి వస్తారా? అలాంటి ప్రశ్నలకు మీరు బోల్డ్ ఆన్సర్ ఇచ్చారు. ఇలాంటి విషయాలను మీరు లైట్ తీసుకుంటారా? అని మరో వ్యక్తి ప్రశ్నించగా…. సెక్సుకు సంబందించిన విషయాలకు ఆదరణ ఎక్కువ కాబట్టి.. అందుకే మొహమాట పడకుండా సమాధానం ఇచ్చాను అంటూ రష్మీ చెప్పుకురావడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus