దర్శకధీరుడు ఛాన్స్ ఇచ్చినా వెళ్లనన్న హాట్ యాంకర్!

అందాలతో కుర్రకారుని టీవీల ముందు కట్టిపడేసిన యాంకర్ రష్మీ,  సినిమాల్లోనూ సెక్సీగా నటిస్తూ యువకులకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ భామ “తను వచ్చెనంట” అనే చిత్రంతో మరోసారి అందాలను ఆరబోయడానికి సిద్ధమైంది. అక్టోబర్ 21 న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానాలు ఇచ్చి వార్తల్లో నిలిచింది.

థియేటర్ కి ప్రేక్షకులు అందాలను చూసేందుకే వస్తారు.. అవి చూపిస్తే తప్పు ఏమిటని తన ఎక్స్ పోజింగ్ విషయంపై ఘాటుగా వివరణ ఇచ్చింది. సినిమాల్లో బిజీ అయ్యారు.. జబర్దస్త్ షో ని వదిలేస్తారా అని ఓ విలేకరి అడగగా. అందుకు ఆమె స్పందిస్తూ “నాకు జబర్దస్త్ వల్లే గుర్తింపు లభించింది. అందువల్లే సినిమా అవకాశాలు వస్తున్నాయి. స్వయంగా రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు వచ్చి పిలిచినా జబర్దస్త్ షోను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టను” అని స్పష్టం చేసింది.

Rashmi Shock to Rajamouli - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus