కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో రష్మికకు ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయి. అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ లాంటి లెజండరీ యాక్టర్ తో కలిసి సినిమా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రష్మికకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ గా ఫాలో అవుతుంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ అంటే తనకు పిచ్చి అని చెప్పుకొచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఐపీఎల్ లో తన ఫేవరెట్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అని చెప్పుకొచ్చింది. కానీ.. విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని ఆమె స్పష్టం చేసింది. విరాట్ కంటే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
ధోనీ బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ తనకు బాగా నచ్చుతాయని.. అతనొక మాస్టర్ క్లాస్ ప్లేయర్ అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. అలానే బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’ ప్రాజెక్ట్ లో నటిస్తోంది.