ఈసారి రష్మిక కూడా క్లారిటీ ఇచ్చేసింది..!

సినీ ఇండస్ట్రీలో రూమర్లనేవి కామన్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా జోరు ఊపందుకున్నాక… ఇది సెలబ్రెటీలకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. గాసిప్స్ కి ఏమాత్రం ఎండ్ కార్డ్ ఉండదు సరి కదా ట్రోలింగ్ తో రచ్చ రచ్చ చేస్తుంటారు నెటిజన్లు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మికల విషయంలో కూడా ఇదే జరిగింది.వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ చిత్రం పెద్ద హిట్టైంది. అయితే ఆ చిత్రం సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక అటుతరువాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కూడా నటించారు. ఈసారి ఏకంగా వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కూడా ప్రచారం జోరందుకుంది. ఇందుకోసమే రష్మిక.. రోహిత్ శెట్టి తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని మరోసారి టాక్ నడుస్తుంది. కన్నడ నాట ఈ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.

‘ఇద్దరూ కలిసి ఒకే హోటల్ లో ఉంటున్నారని, విజయ్ ఎక్కడకి వెళితే అక్కడికి రష్మిక కూడా వెళ్తుందని’ రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. గతంలో ఈ వార్తలపై స్పందించిన విజయ్ అలాంటిదేమీ లేదని చెప్పాడు. తాజాగా రష్మికకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. విజయ్ తో డేటింగ్ లో ఉన్నారా..? అని రష్మికని ప్రశ్నించగా.. “అతడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే.. దానికి మించి మా మధ్య ఏమీలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. మరి రష్మిక స్టేట్మెంట్ తో అయినా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus