తన తల్లికి ఆసక్తికరమైన సమాధానం చెప్పిన రష్మిక

  • July 31, 2019 / 03:55 PM IST

ఇటీవల విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మొదటి షో నుండే ప్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక పెర్ఫార్మన్స్ లు బాగున్నప్పటికీ దర్శకుడు భరత్ కమ్మ టేకింగ్ మరీ స్లో గా.. ప్రేక్షకులకు విసుగు పుట్టించింది. అలా అని సినిమాలో మ్యాటర్ లేదా అంటే… చాలా మంచి కాన్సెప్ట్ నే ఎంచుకున్నాడు. కానీ దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. అందుకే నిర్మాతలు ఈ చిత్రానికి కొంచెం నిడివి తగ్గించి.. కొత్త వెర్షన్ అంటూ ప్రమోషన్లు చేస్తున్నారు. అయినా కలెక్షన్లు రావడం లేదనుకోండి.. అది వేరే విషయం. ఇదిలా ఉంటే.. ‘డియర్ కామ్రేడ్’ కథ మొత్తం రష్మిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే తగినట్టే ఆమె అద్భుతమైన నటన కనపరిచింది. ‘ఇక తన కూతురి నటనకి గర్వపడుతున్నానంటూ’… రష్మిక తల్లి కొన్ని ట్వీట్లు చేసింది.

రష్మిక తల్లి సుమన్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “‘ప్రియమైన లిల్లీ (పాత్ర పేరు). నువ్వు నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేశావు. ఎంచుకున్న రంగంలో నువ్విలా వృద్ధి చెందుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్‌ యూ బేబీ రష్మిక. నిజంగా అద్భుతంగా నటించావు. నీ తర్వాతి చిత్రాలకు ఆల్‌ ది బెస్ట్‌. మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేసింది. దీనికి రష్మిక … ‘థాంక్యూ అమ్మా.. లవ్‌ యూ టూ. ఇప్పుడు మా టీంతో కలిసి మరోసారి సినిమా చూడు. న్యూ వెర్షన్‌ ఎలా ఉందో చెప్పు’ అంటూ జవాబిచ్చింది. సుమన్‌ అక్కడితో సంభాషణను ఆపకుండా… ‘అందరి సంతోషం కోసం ఇలానే కష్టపడు. మా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి. నటిగా ఈ ప్రయాణాన్ని ఎంజాయ్‌ చెయ్‌’ అంటూ మళ్ళీ ట్వీట్‌ చేసింది. దీంతో రష్మిక…. ‘అమ్మా.. నీ దగ్గర ఫోన్‌ ఉందనే విషయాన్ని గుర్తుచేసుకో, నాకూ ఫోన్‌ ఉంది. నేను తీరికగా ఉన్నాను కాల్‌ చెయ్‌. నెటిజన్లు ట్వీట్లు చదువుతున్నారు. వారికి ఇబ్బందికరంగా ఉంటుంది’ అంటూ ఆసక్తికరంగా రిప్లై ఇచ్చింది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus