అందుకే సెల్ఫీలు ఇవ్వడానికి స్టార్స్ భయపడేది..!

రష్మిక మందన .. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ళలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిపోయింది. ‘ఛలో’ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ‘గీత గోవిందం’ చిత్రంతో అంతకుమించిన హిట్టు కొట్టి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అటు తరువాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో మంచి పెరఫార్మర్ అనే ప్రశంసలు కూడా అందుకున్న ఈ బ్యూటీ .. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకుని పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక ఈ బ్యూటీ క్రేజ్ రోజురోజుకి ఎక్కువవుతున్నట్టే కనిపిస్తుంది. తాజాగా ఈమెను ఓ అజ్ఞాత అభిమాని ముద్దు పెట్టుకుని పారిపోవడం పెద్ద సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ ఈవెంట్ కు వెళ్లిన రష్మిక వద్దకు ఓ అభిమాని.. సెల్ఫీలే వంకతో దగ్గరకు వచ్చాడు. కానీ సడెన్ గా ముద్దు పెట్టుకుని వెంటనే పారిపోయాడు. అక్కడి బౌన్సర్ లు సైతం పట్టుకోలేనంత వేగంగా అతను పారిపోయాడు. దీనికి సంబందించిన వీడియో మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసాడు. అది కాస్త క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది. దీంతో రష్మిక అండ్ టీం పోలీసుల సహాయం కోరగా వారు ఆ వీడియో ను డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. బహుశా ఇలాంటి ఫ్యాన్స్ వల్లేనేమో.. స్టార్స్ సెల్ఫీలు ఇవ్వడానికి భయపడేది.


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus