ఛలో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ తొలి చిత్రంతోనే లక్కీ హీరోయిన్ ముద్ర వేయించుకుంది. ఈ ఎక్స్ప్రెషన్ క్వీన్ తెలుగులో చేసిన సినిమాలన్నీసూపర్ డూపర్ హిట్లే.. ఒక్క దేవదాసు మాత్రం యావరేజ్ అయ్యింది. ఈ భామ అదృష్టం ఎలా ఉందంటే తెలుగులో ఇంతవరకు ఆమె ఖాతాలో ఒక్క ప్లాప్ కూడా లేదు. దీంతో వరుసగా స్టార్ హీరోల సరసన చాన్సులు కొట్టేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే రష్మిక ప్రతిరోజు షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ, వ్యాయామం కోసం మాత్రం నిర్ణీత సమయాన్ని కేటాయిస్తుందట.
అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రష్మిక చేసే వర్కౌట్స్‌కు సంబంధించి పిక్స్ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి జిమ్‌లో పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ, మరోసారి సముద్రపు ఒడ్డున డిఫరెంట్ స్టైల్స్‌లో చేసే వర్కౌట్స్ పిక్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూనే ఉంటాయి. రష్మిక వర్కౌట్స్ చేయడమే కాకుండా ప్రతిఒక్కరు ఫిట్నెస్ పెంచుకోవాలని అందుకు వ్యాయామం ఒక్కటే మార్గమని చెబుతుంది. మీకు బద్దకం ఎక్కువ అయితే వ్యాయామం విషయంలో తనకు ఎంతో అనుభవం ఉందని అంటే మార్నిగ్ లేవడానికి బద్దకాన్ని ఎలా వీడాలి,
వ్యాయామాన్ని మన డైలీ అలవాటుగా ఎలా మార్చుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అని పలు రకాల మంచి అలవాలు తనను చూసి నేర్చుకోలని అంటుంది రష్మిక. ఈ క్రమంలో తాజాగా తన సోషల్ మీడియా ఎకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేసిన రష్మిక .. వర్కవుట్ చేయడానికి మీకందరికీ ప్రేరణ అవసరమా.. అయితే ఆలస్యమెందుకు నన్ను చూసి నేర్చుకోండి అంటూ కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఫుల్లు బిజిగా ఉన్న రష్మిక తమిళ్లో కార్తీ, సూర్య సినిమాల్లో చేస్తుంది. తెలుగులో సుకుమార్ – బన్నీ కాంబినేషన్లో తెరక్కుతున్న పుష్ప సినిమాతో పాటు, శర్వానంద్ సరసన ఆడాళ్లూ మీకు జోహార్లు చిత్రంలో నటిస్తుంది రష్మిక.