కన్నడ బ్యూటీ రష్మిక “ఛలో” సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. నాగశౌర్య కి జోడీగా నటించి ఆకట్టుకుంది. విజయంతో పాటు భారీ అవకాశాలను అందుకుంది. ఇప్పుడు ఆమె తెలుగులో విజయ్ దేవరకొండతో “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” సినిమాలు చేస్తోంది. నాగ్, నాని మల్టీస్టారర్ సినిమా “దేవదాస్”లోనూ నాని సరసన నటిస్తోంది. ఇవే కాకుండా కన్నడ చిత్రం “వృత్ర” సినిమాకి సంతకం చేసింది. గౌతమ్ అయ్యర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. ఇలా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఇది వరకే నిశ్చితార్థం అయిందనే విషయం తెలిసిందే.
రెండేళ్ల క్రితం కిరిక్ పార్టీ సినిమా ద్వారా రష్మిక సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం వీరిమధ్య దూరం పెరిగిందని తెలిసింది. మంచి సినిమా అవకాశాలు వస్తుండడంతో.. కెరీర్ పైనే దృష్టి పెట్టాలని రష్మిక భావిస్తోంది. అందుకే పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదని టాక్. పెళ్లి చేసుకుందామని రష్మికని రక్షిత్ అడిగితే అసలు రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. దీంతో రక్షిత్ కోపంగానున్నట్టు కన్నడ సినీ వర్గాలవారు చెప్పుకుంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ విడిపోయారని అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యం పోనవసరం లేదనున్నట్టున్నారు.