అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో రష్మిక రోల్ ఇదే

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉంటే అది రష్మిక మండన్న అనే చెప్పాలి. విజయ్ దేవరకొండతో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న రష్మిక డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ నాలుగు క్రేజీ సినిమాలున్నాయి.. వాటిలో మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, అల్లు అర్జున్-సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమాలున్నాయి. ఇవి కాకుండా ఇంకొన్ని క్రేజీ ప్రొజెక్ట్స్ కు రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు దర్శకనిర్మాతలు.

అయితే.. ఇప్పటివరకూ రష్మిక తన లుక్స్ పరంగా కానీక్యారెక్టరైజేషన్ పరంగా కానీ పెద్దగా రిస్క్ చేసిన సినిమాలు ఏమీ లేవు. “డియర్ కామ్రేడ్”లో క్యారెక్టరైజేషన్ కి కాస్త స్కోప్ ఉన్నప్పటికీ.. అది సరిగా సద్వినియోగపరుచుకోలేదు రష్మిక. ఆ లోటు తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ – సుకుమార్ ల కాంబినేషన్ లో రష్మికను పల్లెటూరి అమ్మాయిలా చూపించనున్నాడు సుకుమార్. హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి.. ఆమె వ్యవహారశైలి వరకూ అన్నిట్లోనూ కొత్తదనం చూపించనున్నాడు సుకుమార్. సొ, రష్మికకు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వనుంది ఈ చిత్రం.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus