Pushpa Songs: ఒక్క పాటతో నెటిజన్లకు కావాల్సినంత స్టఫ్‌!

మనకు రష్మిక మందన… సోషల్‌ మీడియాలో నేషనల్‌ క్రష్‌. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూనే, హిందీలో కూడా ఎంట్రీ ఇస్తోంది రష్మిక. ఈ క్రమంలో ఆమెను పీఆర్‌ టీమ్‌ ‘నేషనల్ క్రష్‌’ అని పిలుచుకుంటోంది. అదే పేరును సోషల్‌ మీడియాలో ప్రాచుర్యంలోకి తీసుకొస్తోంది. దొరికింతే తడవుగా ఏ షోకి వెళ్లినా… అక్కడి కుర్ర స్టార్‌ హీరోలను పొగిడేస్తూ మాటలతో మాయ చేస్తోంది. దీంతో ఆ హీరోల అభిమానులు కూడా ఆమె ఫ్యాన్స్‌గా మారుతున్నారు.

నిజానికి రష్మికకు అంత ఫేమ్‌ ఉందా? స్టార్‌ హీరోయిన్‌ అయ్యేంత స్టఫ్‌ ఉందా? ఇప్పుడున్న స్టార్‌ హీరోయిన్లతో పోలిస్తే ఆమె అడ్వాంటేజ్‌ ఏంటి? ఇలా చాలా ప్రశ్నలే వస్తున్నాయి. వాటికి సమాధానాలు చెప్పడానికి వాళ్ల పీఆర్‌ టీమ్‌ దగ్గర, ఆమె టీమ్‌ దగ్గర కూడా సమాధానాలు ఉంటాయి. అయితే ఒక్క పాటతో అందరూ ఇరుకున పడిపోయారు అంటున్నారు నెటిజన్లు. ఆ పాటే ‘పుష్ప’లోని ‘నా సామి.’ అందులో రష్మిక కనిపించిన తీరు ఏ మాత్రం స్టార్‌ హీరోయిన్‌కి తగ్గట్టు లేదనేది కొందరి వాదన.

‘పుష్ప’ సినిమాలో రష్మిక గ్రామీణ నేపథ్యం ఉన్న శ్రీవల్లి అనే అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. దానికి తగ్గట్టే ఆమె పాత్రను తీర్చిదిద్దారు సుకుమార్. అయితే ఆ క్రమంలో ఆమెలోని లావణ్యం మిస్‌ అయ్యిందనేది చూసుకోలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీరకట్టు విషయంలో తీసుకున్న శ్రద్ధ… మేకప్‌ విషయంలో అస్సలు చూపించలేదు. అలాగే రష్మిక బాడీషేప్‌ విషయంలోనూ జాగ్రత్త పడలేదని అంటున్నారు. ఆమెకు తగ్గట్టు స్టెప్పులు ఇవ్వకపోవడం వల్ల పాటలో ఫీల్‌ మిస్‌ అయ్యింది అంటున్నారు. దీంతో ఏ యాంగిల్‌లో నేషనల్‌ క్రష్‌ అంటున్నారు అనే విమర్శ కనిపిస్తోది. అలా ‘పుష్ప’ పాటతో ట్రోలర్లకు కావాల్సినంత స్టఫ్‌ వచ్చిందని చెప్పాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus