ఆ సినిమా కోసం రష్మికని బాగా ఏడిపించారట

టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ భామ రష్మిక మందన. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం జూలై 26 న విడుదల కానుంది. ఇక మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉండగా.. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం షూటింగ్ సమయంలో రష్మిక వేధింపులకి గురయ్యిందట. ఈ విషయాన్ని రష్మిక నే చెప్పడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.

వేధింపులు అంటే మరో రకంగా కాదండోయ్ … ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కొన్ని సన్నివేశాలకు ఆమెను బాగా ఇబ్బంది పెట్టారని చెప్పింది. రష్మిక మాట్లాడుతూ… ‘ సినిమాలో పది నిమిషాల పాటు ఉండే క్రికెట్ సన్నివేశాల కోసం.. నాతో ఏకంగా నాలుగు నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయించారు. ఈ ప్రాక్టీస్ లో నాకు చాలా దెబ్బలు తగిలాయి. షూటింగ్ అయిపోతుంద‌నుకుంటున్న‌ టైంలో లొకేషన్ లో ఇరవై రోజుల పాటు నన్ను అందరూ చాలా ఏడిపించారు. ఇదంతా ఏదో సీరియస్ గా చెప్పడం లేదు.. ఇష్టంతోనే చెబుతున్నాను. చివరకు డ‌బ్బింగ్ టైంలో కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నాలుగు నెలల పాటు డబ్బింగ్ చెప్పించారు. మొన్న కూడా ఓ సీన్‌కు డ‌బ్బింగ్ చెప్ప‌మ‌న్నారు. నన్ను ఇంత‌ ఇబ్బంది పెట్టినప్పటికీ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus