Rathika Rose: ఆ కంటెస్టెంట్ విన్నర్ కావాలంటున్న రతిక.. ఎవరి పేరు చెప్పారంటే?

  • December 12, 2023 / 12:50 PM IST

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని రేంజ్ లో పాపులర్ అయిన కంటెస్టెంట్లలో రతికా రోజ్ ఒకరు కాగా తాజాగా రతికా రోజ్ మాట్లాడుతూ యావర్ బిగ్ బాస్ విన్నర్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రతికా రోజ్ ఈ కామెంట్లు చేశారు. బిగ్ బాస్ షో సీజన్7 ఉల్టా పుల్టా సీజన్ అని చెప్పారని అయితే ఈ షో వల్ల నాకు నిజంగానే ఉల్టా పుల్టా జరిగిందని రతికా రోజ్ పేర్కొన్నారు.

ఒకసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మళ్లీ రీఎంట్రీ ఇచ్చానని ఆమె తెలిపారు. అయితే హౌస్ లోకి ఫస్ట్ టైమ్ వెళ్లిన సమయంలో మైనస్ అయిందని సెకండ్ టైమ్ మాత్రం ప్లస్ అయిందని రతిక కామెంట్లు చేశారు. ఈ షో వల్ల నాకు మంచి గుర్తింపు, పాపులారిటీ దక్కిందని రతికా రోజ్ కామెంట్లు చేశారు. ప్రశాంత్ కు నేను చెప్పిన విధానం కరెక్ట్ కాదని సరిగ్గా చెప్పకపోవడం వల్ల నేను బ్యాడ్ అయ్యానని రతిక పేర్కొన్నారు.

ప్రశాంత్ కు స్వీట్ గా చెప్పి ఉంటే బాగుండేదని ఆమె కామెంట్లు చేశారు. ప్రశాంత్ కు ఎక్కడో మచ్చ ఉందని లక్ కూడా ఉందని నేను హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ ఆట ఇంప్రూవ్ అయిందని రతిక వెల్లడించారు. యావర్ బిగ్ బాస్ విజేతగా నిలవాలని నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. యావర్ బిగ్ బాస్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడని రతిక అన్నారు.

యావర్ విజేత కావాలని కోరుకుంటున్నానంటే మిగతా వాళ్లు కాకూడదని కాదని రతిక కామెంట్లు చేశారు. రతికా రోజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో తర్వాత రతికా రోజ్ కు మూవీ ఆఫర్లు సైతం పెరుగుతున్నాయని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించిన (Rathika Rose) రతికా రోజ్ రాబోయే రోజుల్లో ఎలాంటి ఆఫర్లను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus