బిగ్ బాస్ హౌస్ లో అందరి గేమ్ వేరు రతిక గేమ్ వేరు అన్నట్లుగా తయారైంది. రీసంట్ గా జరిగిన మాయాస్త్రం టాస్క్ లో తన రూట్ సపరేట్ అని మరోసారి నిరూపించుకుంది. తమ టీమ్ లీడర్ అయిన గౌతమ్ మాటని కూడా లెక్కచేయకుండా నా గేమ్ నేను జెన్యూన్ గా ఆడాలి అంటూ తనలోని కోణాలని చూపించింది. దీంతో హౌస్ మేట్స్ చాలా ఫ్రస్టేట్ అయ్యారు. చివరగా గేమ్ ఛెంజర్ గా వచ్చిన గౌతమ్ ప్రిన్స్ దగ్గరున్న మాయాస్త్రం భాగాలని తీసుకుని శివాజీకి ఇచ్చాడు.
దీంతో ప్రిన్స్ ఫ్రస్టేట్ అయిపోయాడు గౌతమ్ పైకి గట్టిగట్టిగా అరుస్తూ వెళ్లాడు. అయితే, ఈ సిట్యువేషన్ లో రతిక రెచ్చగొట్టే వాఖ్యలు చేసింది. ప్రిన్స్ కంటే షకీల ఎందులో గొప్పో రీజన్ చెప్పాలి అని, అసలు షకీలని రేస్ లో ముందుకు ఎందుకు పెట్టారో రీజన్స్ చెప్పమని గౌతమ్ ని నిలదీసింది. ఫైయిర్ గేమ్ ఆడమని, పాలిటిక్స్ వద్దని చెప్పింది. ఇక్కడే ప్రిన్స్ కంటే షకీల తక్కువ అన్నట్లుగా మాట్లాడింది. దీనికి షకీల రతికని అప్పటికప్పుడు ఏమీ అనలేదు. కానీ, తర్వాత థామినితో చెప్పి బాధపడింది. ఈ విషయం తెలుసుకున్న రతిక తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
స్మోకింగ్ గేమ్ లో స్మోక్ చేస్తున్న షకీల దగ్గరకి వచ్చి తనని క్షమించమని ఇందాక మిమ్మల్ని అలా అన్నాను తక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశ్యం కాదు. డిస్వర్వ్ క్యాండెట్స్ కి ఇవ్వాలన్నదే నా అబిప్రాయం అంటూ మాట్లాడింది. దీనికి షకీల రతికకి స్మూత్ గా గట్టి పట్టే ప్రయత్నం చేసింది. నోరు జారడం ఎందుకు ఇప్పుడు సారీ చెప్పడం ఎందుకు అన్నట్లుగా మాట్లాడింది. దీంతో రతిక అక్కడ చాలాసేపు షకీలని కన్విన్స్ చేసి కాళ్లు పట్టుకుంది. సారీ అమ్మా..
నిజంగా నాకు అనిపించే చెప్తున్నా అంటూ పశ్చాత్తాపం అనే యాంగిల్ ని చూపించింది. అయితే, దీనికి అసలు మేటర్ వేరే అని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అదేంటంటే., రతిక ఫస్ట్ నుంచీ మాయాస్త్రం టాస్క్ లో గేమ్ ఛేంజర్ అవ్వాలని అనుకుంది. అందుకోసం శివాజీని గెలిిపించాలని 4 వారాలు ఇమ్యూనిటీ తనకే రావాలని గేమ్ ఆడాలని అనుకుంది. దీనివల్ల శివాజీ నాలుగు వారాలు నామినేషన్స్ లోకి రాకపోతే ఆయన ఫ్యాన్స్ ఓట్లన్నీ తనకే పడతాయనే స్కెచ్ గీసింది.
ఇప్పుడు కూడా పొరపాటున టాస్క్ లో షకీల విన్నర్ అయితే షకీల నాలుగు వారాలు రాదు కాబట్టి ఆవిడ ఫ్యాన్స్ కూడా రతికకే ఓట్లు వేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ స్కెచ్ గీసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ అసలు మేటర్ తెలిసిన బిగ్ బాస్ లవర్స్ సైతం షాక్ అయిపోతున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ లో 2వ వారం నుంచే హౌస్ మేట్స్ ఆడియన్స్ కి , బిగ్ బాస్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఎవరి స్ట్రాటజీలని వాళ్లు మారుస్తూ అవసరానికి అణుగుణంగా రిలేషన్స్ కలుపుతున్నారు. మొత్తానికి అదీ మేటర్.