Ravanasura Teaser: ఖిలాడి ఛాయలు కనిపిస్తున్నాయి ఏంటి..!

  • March 6, 2023 / 10:48 AM IST

గతేడాది క్రిస్మస్ కి ధమాకా , ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య.. సినిమాలతో మంచి ఫాంలో ఉన్న రవితేజ త్వరలో ఈ సమ్మర్ కు రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్. టి. టీమ్ వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా , మేఘా ఆకాష్ వంటి క్రేజీ హీరోయిన్లు నటిస్తున్న ఈ మూవీలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. రావణాసుర టీజర్ విషయానికి వస్తే.. ఇది 66 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇందులో రవితేజ క్రిమినల్ గా కనిపిస్తున్నాడు, అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే.. అతను ఎస్కేప్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఇందులో చూపించారు. రవితేజ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి.. దీంతో సినిమా పై ఆసక్తిని రేకెత్తించేలా టీజర్ సాగింది.’ ప్ర‌తీ క్రిమిన‌ల్ వాడు చేసిన క్రైమ్ మీద వాడి సిగ్నేచ‌ర్ వ‌దిలి వెళ్లిపోతాడు.

లుక్ ఫ‌ర్ ద సిగ్నేచ‌ర్‌” ”సీత‌ను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే స‌రిపోదు.. ఈ రావ‌ణాసురిడిని దాటి వెళ్లాలి” అనే డైలాగులు టీజ‌ర్లో ఉన్నాయి. సుశాంత్ పాత్ర‌లో నెగిటివ్ ఛాయలు కనిపిస్తున్నాయి. కానీ సినిమాలో విలన్ కూడా రవితేజనే కావచ్చు అనేంత క్రూయల్ గా అతని పాత్ర కనిపిస్తుంది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్ ఈ టీజర్ కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

రవితేజ… మాస్ రోల్స్, కామెడీ చేస్తే బాగుంటుంది . కానీ రావణాసుర వంటి సీరియస్ రోల్స్ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాల ఫలితాలు ప్రూవ్ చేశాయి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus