కె.జి.ఎఫ్ సీక్వెల్ లో సూపర్ ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్

Advertisement

ఇప్పుడంటే ఆమెను తెరపై కనిపించి చాలా ఏళ్లవుతున్న కారణంగా జనాలు ఆమెను మర్చిపోయారు కానీ.. ఓ దశాబ్ధం క్రితం వరకూ రవీనా టాండన్ అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి రవీనా బాలీవుడ్ లో ఏదో చిన్న రోల్స్ చేస్తూ కెరీర్ ను నెట్టుకొస్తోంది. తెలుగులో ఆఖరిసారిగా “పాండవులు పాండవులు తుమ్మెద” అనే సినిమాలో కనిపించింది రవీనా. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రవీనా టాండన్ మళ్ళీ సౌత్ తెరపై కనిపించనుంది. అది కూడా మోస్ట్ క్రేజీయస్ట్ ప్రొజెక్ట్ “కె.జి.ఎఫ్”కి సీక్వెల్ గా వస్తున్న “కె.జి.ఎఫ్ 2″లో.

కన్నడ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం “కె.జి.ఎఫ్”. ఆ సినిమాలోని ఎలివేషన్ షాట్స్ & ఫైట్ సీక్వెన్స్ లకి ప్రపంచస్థాయి సినిమా ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. దాంతో సినిమాలో కనిపించేది కాసేపే అయినప్పటికీ.. ఇందిరా గాంధీగా రవీనా రోల్ ఆమెకు మళ్ళీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus