ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ర‌విబాబు ‘ర‌ష్‌’ మూవీ

  • June 21, 2024 / 08:16 PM IST

తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ‌లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు పోషించి న‌టుడిగా మంచి పేరు తెచ్చుకోవ‌డంతో పాటు ద‌ర్శ‌కుడిగా కూడా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ర‌విబాబు. వైవిధ్యభరిత కాన్సెప్ట్ తెరకెక్కించడంలో ఆయ‌న‌ స్టైలే వేరు. ఒక‌వైపు ‘నచ్చావులే’, ‘మనసారా` వంటి ఆహ్లాద‌క‌ర‌మైన చిత్రాలు తెర‌కెక్కించారు. మ‌రోవైపు ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును’, ‘అవును 2` వంటి హార‌ర్‌, థ్రిల్ల‌ర్ చిత్రాల‌తోనూ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేశారు.

తాజాగా రవిబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించిన‌ చిత్రం ‘రష్’. సతీశ్ పోలోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డైసీ బోపన్న ప్రధాన పాత్ర పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో, యూనిక్ పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్`లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఒక సాధార‌ణ గృహిణికి కొన్ని అసాధార‌ణ ప‌రిస్థితులు ఎదురైతే వాటిని ఆమె ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో, యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది.ఓ సోష‌ల్ ఇష్యూ కూడా మిళితమై ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus