Ravi Babu: ఓటిటిలో విడుదల కాబోతున్న రవిబాబు ‘క్రష్’ మూవీ..!

‘అల్లరి’ చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు రవిబాబు… మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా అతని తీసిన సినిమాలు ఏవీ సక్సెస్ అవ్వడం లేదు.రొటీన్ హారర్ సినిమాలు చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుతం రవిబాబు ‘క్రష్’ బూతు సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఇతను తెరకెక్కించిన ‘అమ్మాయిలు అబ్బాయిలు’ చిత్రం ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దానికి పది రెట్లు రచ్చ చేసేలా ఈ ‘క్రష్’ మూవీ ఉన్నట్టు మొన్నామధ్య విడుదల చేసిన టీజర్ స్పష్టం చేసింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపారు. మొత్తం 9 కట్స్ చేయాలని తీర్మానించారట. అయితే సెన్సార్ వాళ్ళు చెప్పిన సన్నివేశాలను కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని భావించిన రవిబాబు… వాళ్ళ నిబంధనలకు ఒప్పుకోలేదు. రివైజింగ్ కమిటీకి వెళ్లే ఆలోచన కూడా రవిబాబు పెట్టుకోలేదు.తన సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఓటిటిలో విడుదల చేసే సినిమాలకు సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని అంతా చెబుతుంటారు. అందుకే ‘క్రష్’ ను ‘జీ5’ వారికి ఇచ్చేశాడట రవిబాబు. జూలై 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో సాయి సుధా రొమాంటిక్ సీన్లు కూడా ఓ రేంజ్లో ఉంటాయని వినికిడి. మరి ఈ చిత్రం రవిబాబుకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus