శర్వా విలన్ ఇతడే!

Advertisement

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్ కథలో కంటెంట్ ఉంటేనే సినిమాలు చేస్తాడు. యూత్ లో శర్వాకు స్పెషల్ క్రేజ్ ఉంది. తను నటిస్తోన్న సినిమా మినిమమ్ గ్యారంటీ అనేది నిర్మాతల నమ్మకం. ప్రస్తుతం శర్వా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా చంద్రమోహన్ అనే కొత్తన్ దర్శకుడు పరిచయం కానున్నాడు.

ఈ సినిమాలో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో పాత్రతో పాటు ఈ చిత్రంలో విలన్ పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. దీనికోసం చాలా మంది పేర్లు పరిశీలించినప్పటికీ చివరగా రవి కిషన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయనొక మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. రేసుగుర్రం సినిమాలో మద్దెల శివారెడ్డి అనే  పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన రవి కిషన్ ఆ తరువాత కిక్ 2, సుప్రీం వంటి చిత్రాల్లో నటించాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus