క్లిక్ చేసి చూడమంటుంది

రెండేళ్ల బ్రేక్ తీసుకుని ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చాడు మాస్ మహారాజ రవి తేజ. టచ్ చేసి చూడు పెద్దగా ఆడకపోయినా కళ్యాణ్ కృష్ణ కూరసాల తో చేస్తోన్న సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయన – చైతు తో రారండోయ్ వేడుక చూద్దాం అంటూ రెండు హిట్లు నమోదు చేసుకున్న కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా తో హట్రిక్ కొడదాం అని ప్లానింగ్ లో ఉన్నాడు. సీరియల్స్ మరియు యాడ్స్ లో బాగా పాపులర్ అయిన మాళవిక శర్మ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. తెలుగు సినిమా ప్రేమికులకు తెలిసినా తెలియకపోయినా ఈమె నెటిజన్లకు మాత్రం బాగా సుపరిచితమే.

ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఆ రేంజ్ లో ఉంటాయి మరి. రీసెంట్ గా ఈమె పింక్ టాప్ – బ్లూ జీన్స్ వేసుకుని వెనక్కి తిరిగి నిలబడి ఓరగా చూస్తున్న పిక్ చూసి ఫాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. అందంగా ఉంటే ఆశ్చర్యం దేనికి అనుకుంటున్నారా? ఈమె వయసు 20. న్యాయ శాస్ర్తంలో డిగ్రీ చదువుతోంది. ఇంకా స్టూడెంట్ ఏ. సినిమాలంటే ఉన్న ప్రేమతో రెండు బాలన్స్ చేస్తోంది. కానీ ఆమె వయసుకి ఆమె అందానికి. ఏమాత్రం సంబంధం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఈమె ఈమధ్యనే సినిమా సెట్ పైన తన పుట్టిన రోజును కూడా సెలెబ్రెట్ చేసుకుంది. తమ్ మెంబర్స్ తో ఫోటో లు కూడా పెట్టింది. ఈమె తన సెక్సీ లుక్స్ తో ఇప్పటికే యువతను ఉర్రూతలూగిస్తోంది. ఇంకా సినిమా హిట్ అయితే అసలు ఈమెకు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు అంటూ సినిమా పండితులు జాతకాలు చెప్పేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus