సింహం ఒకడుగు వెనక్కి వేసిందంటే.. పడడుగులు ముందుకు వేయడానికే అనే సామెతను గుర్తు చేస్తున్నాడు మన మాస్ మహారాజ రవితేజ. “బెంగాల్ టైగర్” అనంతరం దాదాపు రెండేళ్లు విరామం తీసుకొని “రాజా ది గ్రేట్”తో ప్రేక్షకుల ముందుకువచ్చిన రవితేజ సూపర్ హిట్ కొట్టాడు. ఆల్రెడీ కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తున్న “రాజా ది గ్రేట్” ఆల్రెడీ 36 కోట్ల రూపాయల షేర్ ను కలెక్ట్ చేసింది. రాజా దూకుడు అక్కడితో ఆగలేదు సినిమా శాటిలైట్ హక్కుల రూపంలో 11 కోట్ల రూపాయలు సాధించగా.. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 7 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా ఇప్పటివరకూ “రాజా ది గ్రేట్” వసూలు చేసిన మొత్తం 54 కోట్ల రూపాయలు. చూస్తుంటే.. సినిమా కేవలం షేర్ రూపంలోనూ ఫుల్ రన్ లో 50 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది.
అయితే.. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని రవితేజ తన రెమ్యూనరేషన్ ను పెంచినట్లు తెలుస్తోంది. కాస్త గ్యాప్ తీసుకొన్నాడు కాబట్టి రెమ్యూనరేషన్ ఏమైనా తగ్గించాడేమో అనుకొన్న కొందరు నిర్మాతలు ఆయన్ని సంప్రదించగా.. చాలా సింపుల్ గా 13 కోట్లు అడిగాడట. ఇదివరకు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొనే రవితేజ “రాజా ది గ్రేట్” అనంతరం మూడు కోట్లు పెంచి.. 13 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ రూపంలో అడుగుతుండడం ప్రస్తుతం సెన్సేషన్ అయ్యింది. మరి రవితేజ నిజంగానే రెమ్యూనరేషన్ పెంచాడో లేదో అఫీషియల్ న్యూస్ లేదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త మాత్రం హల్ చల్ చేస్తుంది.