తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నా.. తాను టాలీవుడ్ లోనే ప్రస్తుతం చిత్రాలు చేస్తానని అంటున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ‘ నాకు హిందీ బాగా వచ్చు. తెలుగులో కంటే కూడా హిందీ లోనే స్పష్టంగా మాట్లాడగలను. ఇప్పుడు బాలీవుడ్ లో నటించాలని తొందర ఏమీ లేదు. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నాను. కథ నచ్చితే హిందీలో కూడా నటించడానికి సిద్దంగా ఉన్నాన’ని రవి తెలిపాడు. కామెడీ, యాక్షన్ రెండూ కలగలిసిన చిత్రాల్లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతానని చెప్పిన మాస్ మహారాజ్.. కి& కా, కపూర్ అండ్ సన్స్ వంటి చిత్రాల్లో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రంలో రవి తేజ నటించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుతున్నాయి.