లాభాలను అందించిన మాస్ మహారాజ్ రవితేజ చిత్రం

మాస్ మహారాజ్ రవితేజ విభిన్న పాత్ర పోషించిన ‘రాజా ది గ్రేట్’ గత అక్టోబర్ 18 న రిలీజ్ అయి అందరి మనసులను గెలుచుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధించింది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 5 కోట్ల షేర్ ను రాబట్టి రవితేజ సత్తాని చాటింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రోజు రోజుకు కలక్షన్స్ పెంచుకుంటూ పరుగులు తీసింది.

ఫైనల్ గా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయారని సమాచారం. హీరో అంధుడిగా నటించి ఇన్నికోట్లు వసూలు చేయడం విశేషమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూవీ ఇచ్చిన విజయాన్ని రవితేజ ఆస్వాదించకుండానే నెక్స్ట్ సినిమా పనిలో పడిపోయారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “టచ్‌ చేసి చూడు” సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. నగర శివార్లలో వేసిన ఓ సెట్ లో రాశీ ఖన్నాతో కలిసి రవితేజ స్టెప్పులు వేస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాన్నీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus