మనకి అవసరమా…రవి!!!

  • July 28, 2016 / 06:48 AM IST

టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ…గుర్తున్నాడా….అదే మన కిక్ రవితేజ….గుర్తు ఉండే ఉంటాడులే…ఇంత త్వరగా ఎందుకు మరచిపోతాం. అంటే గత ఏడాది ‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత మళ్లీ కనిపించక పోతే అందరూ మరచిపోయారేమో అని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇంతకీ విషయం ఏమిటంటే…వరుస సినిమాలు..హ్యాట్రిక్ హిట్లు, సూపర్ డూపర్ కలెక్షన్స్ ఇది ఒకప్పటి రవి తేజ కరియర్, ఏడాదిలో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు చేసిన రవితేజ, దాదాపుగా ఏడాది పైనే అయి ఉంటుంది ముఖానికి రంగు వేసుకుని.

అదలా ఉంటే అసలు ఎందుకు రవి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అంటే దానికి గల సరైన కారణాలు తెలీదు కానీ, మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ, ఆయన అవేమి ఒప్పుకోలేదు, దిల్ రాజు సినిమా తీస్తాను అని వచ్చిన రెమ్యునిరేషన్ వద్ద తేడా రావడంతో ఆ ప్రాజెక్ట్ వదిలేసాడు మన వాడు. అయితే ఆ తరువాత సైతం కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అవి సైతం సెట్స్ పైకి వెళ్లలేదు..అదే క్రమంలో మరొక విషయం ఒకటి బయటకు వస్తుంది…అదేమిటంటే…ర‌వితేజ మ‌రోసారి స‌న్న‌బ‌డుతున్నాడు. కిక్2 సినిమా కోసం.. సిక్స్‌ప్యాక్ ట్రై చేసిన మాస్‌రాజా ఫేస్‌లో క‌ళ పోగొట్టుకున్నాడు.

ఇప్పుడు మ‌రోసారి సిక్స్ ప్యాక్ ట్రై చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ర‌చ‌యిత విక్ర‌మ్ సిరి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో.. అత‌ని డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయడానికి ఒప్పుడుకున్నాడ‌ని తెలిసింది. దీని కోసం మ‌రోసారి సిక్స్ ప్యాక్‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. కిక్‌2 దెబ్బ‌కు… కెరీర్‌లో కిక్ పోగొట్టుకున్న ర‌వితేజ‌, మళ్లీ సిక్స్ ప్యాక్ అంటూ ఇలా తప్పులు చేస్తుంటే ఆయన్ని కాపాడడం చాలా కష్టం…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus