Ravi Teja: రవితేజకి వాల్తేరు ఎంట్రీ అలా జరిగిందన్న మాట

  • January 12, 2023 / 12:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేశాడు. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది.

ఇప్పటివరకు విడుదలైన ‘బాస్ పార్టీ’ ‘శ్రీదేవి చిరంజీవి’ ‘వీరయ్య టైటిల్ సాంగ్’ ‘పూనకాలు లోడింగ్’ ‘ నీకేమో అందమెక్కువ ‘ వంటి పాటలు బాగానే అనిపించాయి.ఇదిలా ఉండగా.. ఈ మూవీలో రవితేజ .. విక్రమ్ సాగర్ అనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు రవితేజ .. ఈ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది లేదు. అయితే తర్వాత అతను ఎంట్రీ ఇచ్చాడట. అందుకు కారణం..

ఇతను గతంలో మైత్రి వారితో చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ. ఆ చిత్రం వల్ల బయ్యర్స్ బాగా నష్టపోతే.. మైత్రి వారు చాలా వరకు సర్దారు. అదే టైంలో రవితేజ.. ఇంకో సినిమా చేస్తాను అని అగ్రిమెంట్ పై సైన్ చేశాడు. తర్వాత కథలు కూడా చాలా వినిపించారు మైత్రి వారు. అయితే చివరికి వాల్తేరు వీరయ్య తో ఆ అగ్రిమెంట్ పూర్తయ్యిందని వినికిడి. ఈ సినిమా కోసం రవితేజ రోజుకి రూ.25 లక్షలు ఛార్జ్ చేశాడట. 11 రోజుల పాటు అతను వాల్తేరు వీరయ్య షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus