రవితేజ కొత్త అవతారం!

ఫ్యామిలీ కథలకు కామెడీ టచ్ చేస్తూ ఓ కొత్త పాయింట్ తో సినిమాలు చేయడం దర్శకుడు మారుతి ప్రత్యేకత. ప్రేక్షకులను తన మాస్ యాక్షన్, కామెడీతో ఎంటర్టైన్ చేయడం హీరో రవితేజ స్పెషలిటీ. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవ్వడం విశేషం. ఇప్పటికే ఈ కాంబినేషన్ కి సంబంధించి వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా దర్శకుడు మారుతి.. నిర్మాత అల్లు అరవింద్ కి ఫైనల్ నేరేషన్ చెప్పడం, దానికి ఆయన అంగీకరించడం జరిగిపోయింది. ఈ విషయమై రవితేజతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఇక మిగిలింది అధికార ప్రకటన మాత్రమే. ఈ సినిమాకి GA2 నిర్మాణ భాగస్వామిగా యువి వంశీ కూడా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ కథ మొత్తం కూడా కోర్టు, కేసులు మధ్య తిరుగుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రవితేజ క్రిమినల్ లాయర్ గా కనిపిస్తారని టాక్. క్రిమినల్ లాయర్ అయినప్పటికీ తన మార్క్ కామెడీతో రవితేజ ఎంటర్టైన్ చేస్తాడట. ఈ సినిమాకి థమన్ ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు రమేష్ వర్మతో ఓ సినిమా, అలానే దర్శకుడు త్రినాథరావు నక్కినతో మరో సినిమా లైన్ లో పెట్టాడు. ‘క్రాక్’ షూటింగ్ పూర్తయిన తరువాత రమేష్ వర్మ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి చేస్తారు. ఆ తరువాత ఈ ఏడాది డిసెంబర్ నుండి మారుతి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus