ప్రస్తుతం విజయ్ దేవరకొండ దూసుకెళుతున్న స్పీడ్ కి.. అతడి అభిమానులు ముచ్చటపడుతుంటే, ఇతర హీరోలు మాత్రం కంగారుపడుతున్నారు. తాము పది సినిమాల్లో నటించినా కూడా దక్కని క్రేజ్ ను విజయ్ కేవలం రెండు మూడు సినిమాలతోనే సొంతం చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా.. నాని, నితిన్ లాంటి సీనియర్ యువ హీరోలు ఇప్పటివరకూ క్రాస్ చేయలేకపోయిన 100 కోట్ల మార్క్ ని విజయ్ “గీత గోవిందం” చిత్రంతో సునాయాసంగా క్రాస్ చేయడం చాలా రేర్ ఫీట్ అనే చెప్పాలి.
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం “నోటా”. తెలుగు-తమిళ బైలింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాని అక్టోబర్ మొదటివారంలో విడుదల చేసేందుకు “నోటా” దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అక్టోబర్ 5న తమ సినిమాను విడుదల చేస్తున్నట్లు నెల క్రితమే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన “అమర్ అక్బర్ ఆంటోనీ” అండ్ టీం.. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ అవ్వకపోవడంతో “అమర్ అక్బర్ ఆంటోనీ”ని అక్టోబర్ రేస్ నుంచి తప్పించే పనిలో పడ్డారు. దాంతో విజయ్ దేవరకొండకు అడ్డంకిగా ఉన్న రవితేజ రేస్ నుంచి తప్పుకోవడంతో విజయ్ మళ్ళీ సోలోగా వీర విహారం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. మరి ఈసారి “నోటా”తో ఎలాంటి సెన్సేషణ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.