‘కనితన్’ రీమేక్ కు రవితేజ సరిగ్గా సరిపోతాడు : సంతోష్
- April 18, 2016 / 11:20 AM ISTByFilmy Focus
ఇటీవలే విడుదలై, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న తమిళ చిత్రం ‘కనితన్’. టిఎన్ సంతోష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతోంది. ఈ రీమేక్ లో రవితేజ నటించనున్నట్లు సమాచారం.
రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా, తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు సంతోష్ తెలిపాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సంతోష్ అంటున్నాడు. తమిళంలో కనితన్ ను నిర్మించిన కలైపులి ఎస్ థాను నే తెలుగు రీమేక్ కు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















