అక్టోబర్ లో రానున్న అమర్ అక్బర్ ఆంటోనీ!

Advertisement

మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ ఎంటర్టైన్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ శ్రీనువైట్ల, క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హోల్ సమ్ ఎంటర్ టైనర్ “అమర్ అక్బర్ ఆంటోనీ”. “నీకోసం, వెంకీ, దుబాయ్ శీను” లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ-శ్రీనువైట్లల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రవితేజ సరసన ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. జూలైలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ హీరోయిన్ మారడం, వీసా దొరకకపోవడం వంటి కారణాలుగా లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు నేడు ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్.

ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5వ తారీఖున చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, చిత్రీకరణ చివరి దశకు చేరుకొందని, మిగిలిన ఒక పాటను హైద్రాబాద్ లో షూట్ చేయనున్నామని తెలిపారు. హిలేరియస్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం శ్రీనువైట్ల కెరీర్ కు మాత్రమే కాదు రవితేజ కెరీర్ కు కూడా కీలకమే. ఇక చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై మెరవనున్న ఇలియానా ఈ చిత్రంతో మళ్ళీ బిజీ అయిపోతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news