మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్దం!
- September 6, 2017 / 06:07 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో వారసులకు కొదవే లేదు…అలనాటి అన్నగారి తనయుల నుంచి ఈనాటి ప్రిన్స్ మహేష్ తనయుడు గౌతమ్ వరకూ అందరూ ఇండస్ట్రీని ఏలడానికి పుట్టిన వాళ్లే. అయితే ఇలా వరుసగా వారసులు ఎంట్రీ ఇస్తున్నారు, మన వారసుణ్ణి కూడా దించితే బావుంటుంది అని అనుకున్నాడొ ఏమో తెలీదు కానీ…టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ సైతం తన కుమారుణ్ణి టాలీవుడ్ కి పరిచయం చేసే క్రమంలో ముందుకు అడుగులు వేస్తున్నాడు…ఇంతకీ మాస్ మహారాజా రవి తేజ తనయుడు ఈ సినిమాతో రానున్నాడు? అసలు వివరాలు ఏంటి అంటే…ఒక్కసారి ఈ కధ చదవాల్సిందే…దిల్ రాజు, శిరీశ్ కలిసి నిర్మిస్తోన్న ‘రాజా.. ద గ్రేట్’ సినిమాలో రవి తేజ అంధుడుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ఆయన చిన్నప్పటి సన్నివేశాల కోసం పలువురు బాలనటుల్ని పరిశీలించిన దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డాడు మన రవితేజ వారసుడు మహాధన్. అతనైతే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించిన వాళ్లు.. రవితేజకు చెప్పడంతో, ఆయన సరేనన్నారనీ తెలిసింది. అయితే ఇక్కడే మరో ట్విష్ట్ ఏంటి అంటే, వాస్తవానికి ఈ సినిమాలో మహాధన్ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా విడుదల వరకు గోప్యంగా ఉంచాలని వారు భావించారు, అయితే ఈ లోగా ఆ విషయం వారే వెల్లడించారు. సరికొత్త పాత్రలో వస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు….ఇప్పటికే దాదాపుగా రవి తేజ సినిమా వచ్చి రెండు ఏళ్లు కావడంతో ఈ సినిమా కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా అదీ మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















