బాహుబలి 2 ట్రైలర్ ముందుగా రిలీజ్ కావడానికి కారణం ఎవరు ?

  • March 17, 2017 / 12:53 PM IST

బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ ని రాజమౌళి గురువారం ఉదయం థియేటర్లలో రిలీజ్ చేసి, సాయంత్రం సోషల్ మీడియాలో విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా చిత్ర బృందం ఉదయమే ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. కొన్ని గంటలకముందే అద్భుతం ఆవిష్కృతకావడానికి కారణం ఏమిటని అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ ట్రైలర్ ముందుగా లీక్ కావడమే ప్రధాన కారణమని తెలిసింది. ఎందుకు ఇలా జరిగిందని జక్కన్నను ప్రశ్నించగా .. “సాయంత్ర 5 గంటలకు ట్రైలర్‌ విడుదల చేద్దాం అనుకున్నాం.

కానీ ఫేస్‌బుక్‌లో వచ్చిన బగ్‌ కారణంగా ముందే వచ్చేసింది. ఎందుకు అలా జరిగిందో చూస్తున్నాం. దీనికి ఎవరూ బాధ్యులు కాదు. ఎవరిపైన నిందలు వేయలేము” అని దర్శకధీరుడు వివరించారు. “తొందరగా వచ్చినా అభిమానులు మాత్రం సంతోషంగా ఉన్నారు. అది చాలు మాకు”అంటూ జక్కన్న నవ్వుతూ చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus